Friday, December 20, 2024

వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆహార రంగం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: నాగరిక సమాజంలో ఆహారరంగ పరిశ్రమ వేగంగా అభివృద్ది చెందుతూ వస్తోందని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. గురువారం నేరెడ్‌మెట్‌లోని బలగం ఫ్యామిలీ రెస్టారెంట్‌లో మైనంపల్లి మీడియాతో మాట్లాడుతూ హోటల్స్ రంగంలో రెస్టారెంట్ కల్చర్ పెరిగిపోతోందని, వివిధ రకాల వంటకాలతో వినియోగదారులను అకట్టుకునేందుకు యాజమాన్యాలు పోటీలు పడుతున్నాయన్నారు. వినియోగదారులు రుచి నాణ్యతకే పెద్దపీట వేస్తున్నారని అటువంటి వాటికే ఆదరణ పెరుతుందన్నారు. శాఖాహారం కంటే మాంసాహార వంటకాలు వివిధ రకాల భిన్న రుచులతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయన్నారు.

నార్త్ ఇండియన్ , సౌత్ ఇండియన్ అన్న తేడాలేకుండా అన్ని రకాల వంటకాలు ఇప్పుడు ప్రతి రెంస్టారెంట్‌లో దర్శనమిస్తున్నాయన్నారు. బలగం సినిమా కుంటుంబ విలువలు ఈతరం ప్రజల కళ్లకు కట్టిందని, అదే విధంగా బలంగం తరహా రెస్టారెంట్ కూడా సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి అన్ని రకాల వంటకాల రుచులను ఆస్వాదించేవిధంగా ఉండాలని ఎమ్మెల్యే హనుమంతరావు పేర్కొన్నారు. ప్రముఖ సినీనటుడు మంచు మనోజ్ మాట్లాడుతూ మన ఆరోగ్యంలో 80శాతం మన ఆహారమే నిర్ణయిస్తుందని తెలిపారు. కుటుంబ సభ్యులందరూ రెస్టారెంట్‌లో కలిసే విధంగా మంచి ఆహ్లాదకర వాతావరణం ఉన్నవాటికే ఆదరణ పెరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యామిలి ఫైన్‌డైన్ యజమాని బొల్లా హరిత తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News