Wednesday, January 22, 2025

ఎఫ్‌ఎంసిజి రంగంలో 79 శాతం రెవెన్యూ వృద్ధి

- Advertisement -
- Advertisement -

క్రిసిల్ రేటింగ్స్ జోస్యం

కోల్‌కతా : ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసిజి) రంగం ఈ ఆర్థిక సంవత్సరంలో 79 శాతం రెవెన్యూ వృద్ధిని చూడవచ్చునని క్రిసిల్ రేటింగ్స్ శనివారం విడుదల చేసిన ఒక నివేదిక సూచించింది. గ్రామీణ డిమాండ్ పునరుద్ధరణ, పట్టణ ప్రాంత డిమాండ్‌లో నిలకడ నేపథ్యంలో అధిక వాల్యూమ్ వృద్ధితో ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) రెవెన్యూ పెరగవచ్చునని నివేదిక సూచించింది. 2023-24లో ఎఫ్‌ఎంసిజి రంగం వృద్ది అంచనా 57 శాతం. ఆహారం, బెవరేజ్ (ఎఫ్ అండ్ బి) విభాగానికి సంబంధించిన కీలక ముడి వస్తువుల ధరల్లో స్వల్ప పెరుగుదలతో ఉత్పత్తి ఒక అంకె మేరకు వృద్ధి చెందవచ్చునని నివేదిక పేర్కొన్నది. అయితే, వ్యక్తిగత వినియోగం, గృహ వినియోగానికి సంబంధించిన కీలక ముడి వస్తువుల ధరలు స్థిరంగా ఉండవచ్చు. ‘ఉత్పత్తి విభాగాలు, సంస్థల పరంగా రెవెన్యూ వృద్ధిలో తేడా ఉంటుంది. ఎఫ్ అండ్ బి విభాగం ఈ ఆర్థిక సంవత్సరంలో 89 శాతం మేర వృద్ధి చెందవచ్చు. ఇందుకు గ్రామీణ డిమాండ్ మెరుగుదల దోహదం చేయవచ్చు. వ్యక్తిగత వినియోగ విభాగం 67 శాతం మేర, గృహ వినియోగం 89 శాతం మేర వృద్ధి చెందే అవకాశం ఉంది’ అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ రబీంద్ర వర్మ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News