Tuesday, December 24, 2024

అటవీ శాఖ చెక్ పోస్టులకు ఫాస్ట్ ట్యాగ్ సౌకర్యం

- Advertisement -
- Advertisement -

దోమలపెంట : అటవీ ప్రాంతంలోకి వాహనాలు ప్రవేశించే ప్రక్రియను సులభతరం చేయడానికి అటవి శాఖ అధికారులు ఫారెస్ట్ ఎంట్రీ పాయింట్ల వద్ద ఫాస్ట్ ట్యాగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని డిఎఫ్‌ఓ రోహిత్ గోడిపి, ఎఫ్‌డిఓ విశాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫారెస్ట్ ఎంట్రీ పాయింట్ల వద్ద ఫాస్ట్ ట్యాగ్ ఆ ధారిత సేవలు ప్రారంభించడం వల్ల వాహనల సుధీర్ఘ క్యూలైన్లు, జాప్యాలను నివారించవచ్చని, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోని అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామం దుర్వాసుల చెరువు వద్ద, దోమల పెంట గ్రామం వద్ద ఏర్పాటు చేసిన అట వీ శాఖ చెక్ పోస్టులు ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ సదుపాయం కలిగి ఉన్నాయని అధికారులు తెలిపారు.

ఈ చెక్ పోస్ట్‌ల ద్వారా వెళ్లే వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్‌తో తగినంత బ్యాలెన్స్ ఉండాలని, తేలికపాటి మోటర్ వాహనాలకు ఒక్క వాహనానికి రూ. 50, భారీ వాహనాలకు రూ. 80 వారి ఫాస్ట్ ట్యాగ్ ఖాతా నుంచి పర్యావరణ నిర్వహణ చార్జీల కోసం వసూలు చేయడం జరుగుతుందన్నారు. ఫాస్ట్ ట్యాగ్ లేని ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనదారులు టికెట్ తీసుకోవాల్సి వస్తుందన్నారు. మన్ననూర్ గ్రామం దగ్గర ఏర్పాటు చేసిన అటవీ శాఖ చెక్‌పోస్ట్, దో మల పెంట గ్రామంలో ఉన్న అటవీశాఖ చెక్‌పోస్ట్ ఎన్‌హెచ్ 765 ప్రధాన రహదారిపై వెళ్లే వరకు వాహనాలకు చార్జీలలో ఎలాంటి మార్పులు లేవని తెలిపారు.

అటవీ శాఖ చెక్‌పోస్ట్‌ల లో నేషనల్ హైవే టోల్‌గేట్ల మాదిరిగా ఫాస్ట్ ట్యాగ్ సేవలను అ నుసంధానం చేయడం వల్ల శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శి ంచుకునేందుకు నిత్యం అనేక రాష్ట్రాల నుంచి వందలాది వాహనాలలో భక్తులు వస్తుంటారు కాబట్టి ఫాస్ట్ ట్యాగ్ సేవలను అ నుసంధానం చేయడంతో టోల్ ఫీజు చెల్లింపుకు ఇబ్బంది ఉం డదన్నారు. రద్దీగా ఉండే చెక్‌పోస్టుల వద్ద టోల్ రుసుము గురి ంచి చాలా సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడేదని, ఫాస్ట్ ట్యాగ్ సేవలను అనుసంధానం చేయడంతో క్షణాలలో పను లు జరుగుతున్నాయని మల్లన్న దర్శనానికి వెళ్లే భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News