Tuesday, September 17, 2024

అత్యాచారాలు, సైబర్‌క్రైమ్‌పై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అత్యాచారాలు, సైబర్‌క్రైమ్‌పై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కెటిఆర్ తెలిపారు. అత్యాచారాలు చేసిన వారికి త్వరగా శిక్ష పడాలని, బాధితులకు త్వరగా న్యాయం జరుగుతుందనే భరోసా ఇవ్వాలన్నారు. శాసనసభలో సివిల్ కోర్టుల సవరణ బిల్లును మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశ పెట్టారు. సివిల్ కోర్టుల సవరణ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా కెటిఆర్ ప్రసంగించారు. సైబర్ క్రైమ్ బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబర్‌క్రైమ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు త్వరగా భర్తీ చేయాలని, కేంద్ర చట్టాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తన వైఖరి చెప్పాలని నిలదీశారు.

భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే చట్టాలు తీసుకరావడం మంచిది కాదని కెటిఆర్ హితువుపలికారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ హరించేలా కొన్ని చట్టాలు వస్తున్నాయని, సభలో మా సభ్యులు ఎవరూ వీడియోలు తీయలేదని, అసెంబ్లీలోని కెమెరాలన్నీ స్పీకర్ ఆధీనంలోలో ఉంటాయన్నారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననం జరుగుతోందని, ప్రధాని నరేంద్ర మోడీ, సిఎంల వ్యక్తిత్వాన్ని కూడా కించపరిచేలా వీడియోలు వచ్చాయని, తెలంగాణకు లబ్ధి కలిగించే విషయాల్లో అందరూ కలిసి పని చేయాలని కెటిఆర్ పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News