Wednesday, January 22, 2025

ప్రేక్షకాదరణ చూరగొంటున్న ‘ఫాస్ట్ ఎక్స్’ సినిమా

- Advertisement -
- Advertisement -

ముంబై: విన్ డీజిల్, జాసన్ మోమోవా నటించిన హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా ‘ఫాస్ట్ ఎక్స్’ తొలి రోజున(శుక్రవారం) రూ. 12 కోట్లు ఆర్జిస్తే, రెండో రోజున 10 శాతం జంప్‌తో దాదాపు రూ. 13 కోట్లు నికరంగా సంపాదించింది. ఈ విషయాన్ని బాక్సాఫీస్ ఇండియా పేర్కొంది. రెండు రోజుల మొత్తం కలెక్షన్ నికరంగా రూ. 25 కోట్లు. అయితే ఈ సినిమా హిందీ సర్కూట్స్‌లో కన్నా దక్షిణాదిలో బాగా ఆదరణ చురగొంటోంది.

నైజామ్/ఆంధ్ర సర్కూట్‌లో రెండు రోజుల కలెక్షన్ రూ. 4 కోట్లుగా ఉంది. కాగా తమిళనాడు, మైసూరులో మంచి కలెక్షన్‌లు సాధించింది. ఈ సినిమాలో విన్, మోమోలే కాక హెలెన్ మిర్రెన్, చార్లీజ్ థెరోన్, మిచెల్ రోడ్రిగ్జ్, జాన్ సెనా, జాసన్ స్టాథం, రిటా మోరెనో, కార్డి బి తదితరులు కూడా నటించారు. స్వర్గీయ పాల్ వాకర్ కూతురు మీడో రైన్ వాకర్ ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాలో పాల్ వాకర్ రహస్య పోలీస్ పాత్రలో కనిపిస్తారు. దివంగత పాల్ వాకర్, విన్ డీజిల్ మధ్య స్నేహం ఉంది. ‘ఫాస్ట్ ఎక్స్’ వారి ఫ్రాంచైజీలో వచ్చిన పదవ చిత్రం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News