Monday, December 23, 2024

శివరాత్రి రోజు చేసే ఉపవాసం అంతరార్థం ఇదే..

- Advertisement -
- Advertisement -

హిందువులకు ఎంతో పవిత్రమైన పర్వదినం మహాశివరాత్రి. ఆరోజు ఉదయం శివుడిని పూజించి, ఉపవాసం ఉండి, రాత్రంతా జాగారం చేస్తారు. మహాశివరాత్రి రోజు ఉపవాసం చేయడం వల్ల ఎంతో పవిత్రత వస్తుందని అంటారు. ఆ ఒక్కరోజు ఉపవాసం ఉండి జాగారం చేస్తే ఏడాదంతా శివుడిని ఆరాధించిన పుణ్యం దక్కుతుందని నమ్ముతుంటారు. అయితే, ఉపవాసం చేయడంలో అంతరార్థం దాగి ఉందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు.

సుఖభోగాలు మనిషిని దైవానికి దూరం చేస్తాయి.. ఉపవాసం వంటి కఠిన నియమాల వల్ల ఇంద్రియాల ప్రభావం తగ్గి ఆధ్యాతిక సాధనలకు మార్గం సుగమం అవుతుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. వారానికోసారి ఘనాహారానికి దూరంగా ఉండమని వైద్యులు కూడా సూచిస్తుంటారు. ఆరోగ్య సమస్యల్లేనివారు వారానికోసారి ఉపవాసం చేయాలి. ఇందువల్ల శరీరంలోని విషతుల్యమైన పదార్థాలు బయటకు పోతాయి. జీర్ణకోశానికి తగిన విశ్రాంతి దొరుకుతుంది. అప్పుడప్పుడు ఉపవాసం ఉండటం వల్ల జీర్ణకోశం శక్తి పుంజుకుని సక్రమంగా పనిచేస్తుంది. కటిక ఉపవాసం అనే పేరుతో మంచి నీటిని సైతం సేవించకుండా ఉపవసించడం మంచిదికాదు. శరీరంలో నీటి నిల్వలు తగ్గకుండా చూసుకోవాలి. పాలు, పండ్ల రసాలు తీసుకోవడం వల్ల ఉపవాసం చెడదని పెద్దలు చెబుతారు. ఏదైనా భగవంతునికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించాలి.

సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగన స్నానం చేసి, శివుని ధ్యానించాలి. అన్నం, పప్పు దినుసులతో చేసిన పదార్థాలు నిషిద్ధం. సముద్రపు ఉప్పు కాకుండా నల్ల ఉప్పు లేదా సైంధవ లవణాన్ని తినే పదార్ధాలలో వాడాలి. పాలూ పండ్లూ తినొచ్చు. ముఖ్యంగా దృష్టిని ఆహారం మీద పెట్టకుండా భగవంతుని ధ్యానించడమే ఉపవాస లక్ష్యం. ఆహారం మన ఆలోచనలను నియంత్రిస్తుంది. కనుక సాత్వికాహారమైన పాలు, పళ్లని స్వీకరించాలి. అన్నం పప్పులలో ఉండే ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు అరగడానికి జరిగే ప్రక్రియ వల్ల మెదడుకు రక్తప్రసరణ తగ్గుతుంది. శరీరం భుక్తాయాసంతో మందకోడిగా తయారవుతుంది. అందుకని అన్నం పప్పులు వంటి ఆహార పదార్థాలని ఉపవాస దీక్షా సమయంలో తినకూడదు. ఆరోగ్యం సరిగా లేనివారు, వృద్ధులు, బాలింతలు, గర్భవతులు, చిన్నపిల్లలు ఉపవాస దీక్షను చేయవలసిన నియమం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News