Monday, December 23, 2024

మహారాష్ట్ర సమృద్ధి ఎక్స్‌ప్రెస్ వేపై ఘోర ప్రమాదం: 12మంది మృతి

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహారాష్ట్రలోని సమృద్ధి ఎక్స్‌ప్రెస్ వేపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో ఔరంగాబాద్ జిల్లా వైజాపూర్ సమీపంలో ఎక్స్‌ప్రెస్ వేపై వేగంగా దూసుకువచ్చిన టెంపో ట్రావెలర్ మినీ బస్సు ఆగి ఉన్న కంటైనర్ ట్రక్కును వెనకనుంచి ఢీకొనింది.దీంతో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 23 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఒక మైనర్ బాలిక ఉన్నట్లు వైజాపూర్ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్యామసుందర్ కవ్తలే చెప్పారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మినీ బస్సులో 17 మంది మాత్రమే ప్రయాణించడానికి అవకాశం ఉండగా, 35 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా బుల్ధానా జిల్లాలోని సైలానీ బాబా దర్గాను సందర్శించి నాసిక్ తిరిగి వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు తలా రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఎక్స్‌గేషియాను ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News