Saturday, December 28, 2024

ఘోర బస్సు ప్రమాదం.. 13మంది మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడిన ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా 25మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పూణేలోని పింపుల్ గురవ్ నుంచి గోరెగావ్ కు బస్సు వెళ్తుండగా పూణె-రాయగఢ్ సరిహద్దులో తెల్లవారుజామున 4:30గంటలకు ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నారు. రాయ్ గఢ్ లోని ఖోపోలి ప్రాంతంలో బస్సు కాలువలో పడటంతో 13మంది మరణించారు. 25మందికి పైగా గాయపడ్డారని, రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని రాయగఢ్ ఎస్ పి సోమనాథ్ ఖర్గే తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, రెస్య్కూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News