Sunday, December 22, 2024

హనుమకొండలో ఘోర బస్సు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

హనుమకొండలో శుక్రవారం ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుల్ల శివారు జాతీయ రహదారిపై డీజిల్ ట్యాంకర్, టిఎస్ఆర్టీసీ బస్సు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు, కండక్టర్ సహా 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. బస్సు రోడ్డుపైనే ఉండగా, డీజిల్ ట్యాంకర్ రోడ్డుపక్కన పల్టీలు కొట్టి పడింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థతి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News