Monday, December 23, 2024

పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 18 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో ఆదివారం తెల్లవారు జామున పంజాబ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సు, వ్యాను ఢీకొనడంతో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీస్‌లు వెల్లడించిన వివరాల ప్రకారం , 40 మంది ప్రయాణికులతో కరాచీ నుంచి ఇస్లామాబాద్‌కు వెళ్తున్న ఒక బస్సు , ఇంధన ట్యాంక్‌తో ముందు వెళ్తున్న వ్యాన్‌ను ఢీకొట్టింది. దీంతో ట్యాంక్ పేలి మంటలు చెలరేగాయి.

బస్సు లోకి మంటలు వేగంగా వ్యాపించడంతో 18 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. కొందరు బస్సు కిటికీల నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మృతదేహాలకు డిఎన్‌ఎ పరీక్ష నిర్వహించి వారి కుటుంబాలకు అందిస్తామని పోలీస్‌లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News