Sunday, January 19, 2025

సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -
  • ఆటోను ఢీకొని వ్యక్తి మృతి మరొకరికి తీవ్రగాయాలు

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆటోను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సిద్దిపేట వన్ టౌన్ సిఐ బిక్షపతి తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట పట్టణానికి చెందిన తడిగోపుల శ్రీమన్ (17), రోషం దివేయేంద్ర (18)లు ముస్తాబాద్ చౌరస్తా నుండి పుల్లూరు వైపు ద్విచక్ర వాహనం యమహా ఆర్15పై వెళుతున్న క్రమంలో నిమ్రా గార్డెన్ సమీపం వద్ద ఆటో నెంబర్ టిఎస్ 36 టి 5676 అకస్మాత్తుగా యూటర్న్ చేసుకోవడంతో ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు అతివేగంగా వచ్చి ఢీకొనడంతో శ్రీమన్ అక్కడికక్కడే మృతి చెందగా దివేయేంద్ర కు తీవ్ర గాయాల అవడంతో ప్రమాద స్థలం వద్ద ఉన్నవారు 108 కాల్ చేసి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారన్నారు. ప్రమాదానికి గురైన ఇద్దరినీ వైద్యులు పరిశీలించి మృతి చెందిన శ్రీమాన్‌ను మార్చురీకి తరలించగా, తీవ్ర గాయాలైన దివేయేంద్రను మెరుగైన చికిత్సకై హైదరాబాద్‌కు తరలించారు. మృతుని తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News