Wednesday, January 8, 2025

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారీ వర్షం కురుస్తుండగా అతివేగంగా దూసుకొచ్చిన వ్యాన్‌‌ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ లో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు మృతి చెందిగా, మరో 14మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. తిరుచెందూర్ సుబ్రమణ్య స్వామీ ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఉలుందూర్‌పేట సమీపంలోని మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News