శంషాబాద్ పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డుపై మూడు కార్లు ఢీకొన్న సంఘటనలో ముగ్గురు మృతి చెందారు. సంఘటనా స్థలం వద్ద ఇద్దరు మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తెలిసిన వివరాల ప్రకారం… వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలానికి చెందిన వారు 11 మంది తుఫాన్ వాహనంలో మరో వాహనంలో 5 మంది యాదగిరిగుట్ట దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శంషాబాద్ పెద్ద గోల్కొండ అవుటర్ రింగ్ రోడ్డు పై రాగానే వెనుక నుంచి వస్తున్న రెడ్ కలర్ వాహనం ముందు వెళ్తున్న నిస్సాన్ అనే వాహనాన్ని ఢీకొని అదే వాహనం ముందు వెళ్తున్న తుఫాన్
వాహనాన్ని అజాగ్రత్తగా నడిపిన బెలోనో వాహనం బలంగా ఢీకొనడంతో ప్రమాద స్థలంలోనే డ్రైవర్ తాజ్ (40), వరాలు (43) సంఘటన స్థలంలో మృతి చెందగా (2) నెలల బాబును ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి దీక్షిత్ అనే పాప విషమంగా ఉంది. మిగిలిన 8 మంది దీక్షిత, అర్చన, కీర్తి, మానెమ్మ, చంద్రశేఖర్, శోభ, మిధున, నిర్మల, కృష్ణవేణి, అక్షిత, కీ తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని శంషాబాద్ సన్‌రైస్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఏసీ శ్రీనివాసరావు జరిగిన ఘోరాన్ని పర్యవేక్షించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
కూలీల ఆటోను లారీ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలైన సంఘటన గురువారం చోటుచేసుకుంది. ఉండవెల్లి ఎస్‌ఐ శ్రీనివాసులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా తాండ్రపాడుకు చెందిన కూలీలు ఆటోలో డ్రైవర్ 17 మంది కూలీలతో మహబూబ్‌నగర్ జిల్లా ఉండవెల్లి మండలం కంచుపాడు గ్రామ శివారులోని మిరప పంటలో కలుపు పనులకు వస్తుండగా 44 నెంబర్ జాతీయ రహదారిపై వరసిద్ధి వినాయక పత్తి మిల్లు సమీపంలో కర్నూలు నుంచి హైదరాబాద్ వైపు ముందుగా వెళ్తున్న ఆటోను లారీ వెనుకాల నుండి లారీ ఢీకొంది.
దీంతో ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న బెస్త లక్ష్మీదేవి (56) తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్ర గాయాలైన రమాదేవిని హైవే అంబులెన్స్‌లో కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి రమాదేవి (40) మృతి చెందినట్లు తెలిపారు. ఆటో డ్రైవర్ నరసింహులు, అనితకు తీవ్ర గాయాలు కాగా మరో 13 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వీరు కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ప్రత్యక్ష సాక్షి నందు ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.