Sunday, January 12, 2025

టెన్నెస్సీ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్‌: ఆదివారం టెన్నెస్సీ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కారు పల్టీలు కొట్టడంతో ఆరుగురు చనిపోయారు. టెన్నెస్సీ రాష్ట్రంలోని ప్లెసెంట్‌ వ్యూ, స్ప్రింగ్‌ఫీల్డ్‌ సమీపంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో ఏడేండ్ల చిన్నారి సహా ఆరుగురు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయడప్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 1-18 ఏండ్ల వయస్సుగల ఐదుగురు బాలికలు, ఓ మహిళ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన వారిని దవాఖానకు తరలించారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News