Friday, December 20, 2024

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొట్టి బోల్తా పడిన ట్రక్కు..ఏడుగురు స్పాట్ డెడ్

- Advertisement -
- Advertisement -

ఆటోను ఓ ట్రక్కు ఢీకొట్టి.. దానిపై బోల్తా పడటంతో ఏడుగురు మృతి చెందారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం
మధ్యప్రదేశ్‌లో ప్రమాదం జరిగింది. జబల్‌పూర్ జిల్లాలోనిమజ్‌గవాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నుంజ ఖమ్‌హారియా గ్రామ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు ప్రమాదవశాత్తు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు మృతి చెందగా…మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

తీవ్రంగా గాయపడిన ముగ్గురు కూలీలను జబల్‌పూర్‌లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెడికల్ హాస్పిటల్‌కు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.బాధితులంతా ప్రతాపూర్ వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశ ఉందని పోలీసులు చెబుతున్నారు.

ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి మోహన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన, గాయపడిన వ్యక్తుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. కాగా ఈ ప్రమాదానికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News