ప్రముఖ గాయకుడు రహత్ ఫతే అలీఖాన్ గురించి తెలియనివారు ఉండరు. ‘తెరె మస్త్ మస్త్ దో నైనా’, ‘భర్ దె జోలీ’, ‘ఆఫ్రీన్ ఆఫ్రీన్’ వంటి పాటలతో బాలీవుడ్ ను సంగీత ప్రపంచంలో ఓలలాడిస్తున్న గాయకుడు. తాజాగా ఈ బడా గాయకుడు వివాదంలో చిక్కుకున్నాడు. రహత్ ఫతే అలీఖాన్ తన ఇంట్లో ఒక వ్యక్తిని చెప్పుతో కొడుతున్న దృశ్యాలు నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ, రహత్ చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. రహత్ ‘నా బాటిల్ ఏది? ఎక్కడ?’ అని అడుగుతూ అతన్ని కొట్టడాన్ని బట్టి చూస్తే, దెబ్బలు తింటున్న వ్యక్తి ఆ బాటిల్ ను మాయం చేసినట్లుగా అర్ధమవుతోంది.
నెట్లో తను ఒక వ్యక్తిని చితకబాదిన వైనం వైరల్ కావడంతో రహత్ ఫతే అలీఖాన్ జరిగిన సంఘటనపై వివరణ ఇస్తూ వీడియో విడుదల చేశారు. అందులో తాను కొట్టిన వ్యక్తి తన శిష్యుడేననీ, శిష్యుడు మంచి చేస్తే మెచ్చుకోవడం, తప్పు చేస్తే దండించడం మామూలేననీ చెప్పుకొచ్చారు. పైగా దెబ్బలు తిన్న వ్యక్తి చేత, అతని తండ్రి చేత కూడా మాట్లాడించారు. దెబ్బలు తిన్న వ్యక్తి పేరు నవీద్ హసన్. రహత్ ఫతే అలీఖాన్ తన కుటుంబానికి గత 40 ఏళ్లుగా సన్నిహితుడనీ, ఆయన పట్ల తనకు శత్రుభావం లేదనీ, గురువు దండిస్తే శిష్యుడికి కోపం ఎందుకు వస్తుందనీ అతను అన్నాడు. ఈ వీడియో తీసిన వ్యక్తి తన ప్రతిష్ఠను దెబ్బతీసే ఉద్దేశంతోనే నెట్ లో పోస్ట్ చేశాడని రహత్ ఫతే అలీఖాన్ ఆరోపించారు.
What a justification
From black label to dum ka pani 😂😂😂😂😂😂😂😂😂#RahatFatehAliKhan #RahatFatehAli pic.twitter.com/YMq8MYNzNQ— jiیa (@aintyourpanda) January 28, 2024