Saturday, April 5, 2025

పిడుగుపాటుకు తండ్రి ,కూతురు మృతి

- Advertisement -
- Advertisement -

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం ముద్దులపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది.  మంగళవారం మధ్యాహ్నం సమయంలో కురిసిన భారీ వర్షంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగు పడడంతో పత్తి చేనులో  పని చేస్తున్న తండ్రి లింగస్వామి (50), కుమార్తె కావేరి (18) మృతి చెందారు. ఒకే కుటుంబం లో తండ్రి,కుమార్తె చనిపోవడంతో గ్రామంలో విషాధ చాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృత దేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News