Monday, January 27, 2025

చెరువులో దూకి తండ్రి, కూతురు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

చెరువులో దూకి తండ్రి, కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన మోపాల్ మండలంలోని న్యాల్‌కల్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే నగరంలోని వర్ని చౌరస్తాకు చెందినకు చెందిన రఘుపతి క్రాంతి (35) అతని కూతురు నేహా (18) నెలల కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. నేహా గత కొన్ని రోజులుగా అనారోగ్యం కారణంగా బాధపడుతున్నట్లు తెలిపారు. అందుకు ఎన్ని ఆసుపత్రులు తిరిగిన అనారోగ్యం నుంచి కోలుకుంటలేదనే తీవ్ర మనస్తాపానికి గురై సూసైడ్ నోట్‌లో

జీవితంలో ఫెయిల్ అయ్యా ఇలా బతకడం నా వల్ల కావట్లేదు అందుకే కూతురిని తీసుకొని చనిపోతున్న అని సూసైడ్ నోట్ రాసి ఆదివారం అర్థరాత్రి న్యాల్‌కల్ శివారులోని చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను గాలించి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాధచాయలు అలుమకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News