Sunday, January 5, 2025

రాత్రి అందరం మాట్లాడుకుని పడుకున్నాం: మృతుడి తల్లి జయమ్మ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్ బోయిన్ పల్లి పిఎస్ పరిధి భవానీనగర్ లో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. నిద్రమాత్రలు తీసుకుని తండ్రి , ఇద్దరు కుమారైలు ఆత్మహత్య చేసుకున్నారు. కుమారైలు శ్రావ్య, స్రవంతిలకు నిద్రమాత్రలు ఇచ్చి తండ్రి శ్రీకాంత్ చారి ప్రాణాలు తీసుకున్నాడు. కుటుంబ కలహాలతోనే చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు బోయిన్ పల్లి పోలీసులు.

మృతుడు శ్రీకాంత్ చారి భార్య మీడియాతో మాట్లాడుతూ… కుటుంబసభ్యుల మధ్య తగాదాలు ఏమీ లేవని తెలిపారు. రాత్రి భోజనం తర్వాత అందరం ఒకేచోట పడుకున్నామన్నారు. ఉదయం లేచి చూసేసరికి విగతజీవులుగా పడి ఉన్నారని కన్నీరుమున్నీరయ్యారు. తమకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేవు అని శ్రీకాంత్ చారి తల్లి జయమ్మ తెలిపారు. రాత్రి అందరం మాట్లాడుకుని పడుకున్నామని చెప్పారు. కొన్నాళ్లుగా శ్రీకాంత్ వ్యాపారం సరిగా నడవడం లేదని జయమ్మ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News