Sunday, September 8, 2024

డ్రగ్స్ సరఫరా చేస్తున్న తండ్రి కుమారుడు అరెస్టు

- Advertisement -
- Advertisement -

డ్రగ్స్ సరఫరా చేస్తున్న తండ్రి కుమారుడిని రాచకొండ ఎస్‌ఓటి మహేశ్వరం, బాలాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 100 గ్రాముల హెరాయిన్, రూ.13,000 నగదు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు. మధ్యప్రదేష్ రాష్ర్టం, రట్లాం, జోరాకు చెందిన సిద్దిఖ్ షా అలియాస్ సిద్దిఖ్ కాస్మటిక్ వ్యాపారం చేస్తున్నాడు, హనీఫ్ షా అలియాస్ హనీఫ్ తండ్రీ కుమారుడు. సిద్దిఖ్ షాకు ఎనిమిది మంది సంతానం. ఈ క్రమంలో కుటుంబపోషణ భారం కావడంతో తన కొడుకు సిద్ధిక్‌తో కలిసి కాస్మొటిక్ వ్యాపారం చేశాడు.

అయితే కాస్మోటిక్ వ్యాపారంలోనూ నష్టాలు చవిచూశారు. దీంతో డ్రగ్స్ అమ్మితే భారీగా లాభాలు వస్తాయని తండ్రీకొడుకులు భావించారు. ఎక్కువ డబ్బులు సంపాదించాలనే అత్యాశతో చెడు మార్గాన్ని ఎంచుకున్నారు. దీంతో రాజస్థాన్‌కు చెందిన మోంటు అనే వ్యక్తి నుంచి తండ్రి కొడుకులు హెరాయిన్‌ను రూ.6లక్షలకు కొనుగోలు చేశారు. హైదరాబాదులోని పలువురు డ్రగ్ ఫెడ్లర్‌లకు విక్రయిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు పక్కా ప్రణాళికతో అక్కడకు చేరుకుని. డ్రగ్ ఫెడ్లర్‌లకు విక్రయిస్తుండగా తండ్రీకొడుకులిద్దరినీ పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News