Thursday, December 26, 2024

ఉప్పల్ లో తండ్రీకొడుకులు దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

Man Murdered in Anantapur

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా ఉప్పల్ లోని గాంధీ విగ్రహం వద్ద తండ్రీ కొడుకులను దారుణంగా హత్య చేశారు. గురువారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఉప్పల్ కు చెందిన నరసింహ శర్మ(78), అతడి కుమారుడు శ్రీనివాస్ శర్మ(35) హత్య చేశారు. గొడ్డలితో తండ్రిపై దాడి చేస్తుండగా కుమారుడు అడ్డురావడంతో అతడిని కూడా నరికేశారు. ఇద్దరినీ అత్యంత పాశావికంగా దుండగులు హత్య చేశారు. ఘటన జరిగిన కాలనీకి రెండు వైపుల వీధులు ఉన్నాయి. తనను సైతం కత్తితో బెదిరించినట్లుగా పని మనిషి చెబుతుంది.

శుక్రవారం తెల్లవారుజామున ఐదున్నర గంటల సమీపంలో బ్లూ టీ షర్టు వేసుకున్న వ్యక్తి గాంధీ బొమ్మ నుంచి మెయిన్ రోడ్డు వైపు పారిపోయినట్లుగా స్థానికులు చెబుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు  హుటాహుటిన ఉప్పల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.  వెంటనే టీములుగా విడిపోయి పోలీసులు పలు కాలనీలు, ప్రదేశాల్లో చుట్టుప్రక్కల గాలించారు. మృతులు అత్యంత సౌమ్యులని, ఇరుగుపొరుగు వారితో మంచి స్నేహపూర్వక సంబంధాలు ఉండేవని చెబుతున్నారు. హత్యకు గల కారణాలను సేకరించే పనిలో క్లూస్ టీమ్, స్థానిక, పోలీసులు నిమగ్నమయ్యారు.

ఇవి కూడా చదవండి

ఎర్రబెల్లితో ముచ్చటించిన వృద్ధుడు

కోమటిరెడ్డి… కోవర్టు రెడ్డి కావొద్దు: విహెచ్

ఓటర్లు కెసిఆర్ ను మరచిపోయే పరిస్థితి లేదు…

యువతిని రైలు కింద తోసేసి…

ప్రేమించిన టీచర్‌కు పెళ్లి నిశ్చయం.. విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News