Saturday, December 28, 2024

కామారెడ్డిలో విషాదం.. పాము కాటుతో తండ్రి, కొడుకు మృతి

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: జిల్లా రాజంపేట్ మండలంలోని శేర్ శంకర్ తాండ గ్రామంలో తండ్రికొడుకులు మృతి చెందిన సంఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో  తండ్రి ముద్రిచ రవి(40) అతని కుమారుడు వినోద్ (12)లు కుటుంబంతో సహా ఇంట్లో పడుకున్న సమయంలో పాము కాటు వెయ్యడంతో కొడుకు వినోద్ అక్కడికక్కడే మృతి చెందాడు.

తండ్రి కూడా తనకు తిమ్మిర్లు వస్తున్నాయని చెప్పడంతో అతనిని చికిత్స కోసం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తండ్రి రవి కూడా మృతి చెందాడు. దీంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News