Wednesday, January 22, 2025

విద్యుత్ షాక్‌తో తండ్రి, కొడుకు మృతి

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఎంసిసి సిమెంట్ ఫ్యాక్టరీ పక్కన రామాలయం ఏరియాలో విద్యుత్ షాక్‌తో తండ్రి కొడుకులు దుర్మరణం చెందారు. ఎయిర్ కూలర్‌కు ఇనుప వైరు తగిలి ఉన్న విషయం గమనించక తండ్రి ఎడ్ల రాజేందర్ తీగపై బట్టలు ఆరవేయడంతో విద్యుత్ ప్రసారం జరిగి షాక్ తగిలింది. తండ్రి విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాపాయ స్ధితిలో ఉండగా గమనించిన కొడుకు పవన్‌కుమార్ తండ్రికి ఏమైందోనని తండ్రిని పట్టుకోగా అతడుకు కూడా షాక్‌కు గురయ్యాడు. దీంతో తండ్రి, కొడుకులు అక్కడికక్కడే మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకే ఇంట్లో తండ్రి కొడుకులు మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News