- Advertisement -
ధర్మపురి: జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలం కొసునూరుపల్లెలో విషాదం చోటుచేసుకుంది. తండ్రి, కుమారుడిని కరోనా మహమ్మారి బలితీసుకుంది. మే 7న తండ్రి ఉట్కూరి హన్మంతరెడ్డి (75)కరోనా బారినపడ్డారు. తండ్రికి చికిత్స చేయించేందుకు కుమారుడు సింగపూర్ నుంచి వచ్చాడు. తండ్రికి సేవలందిస్తూ కొడుకు గంగిరెడ్డి కరోనా సోకింది. మే 15న కరోనాతో తండ్రి హన్మంతరెడ్డి మృతిచెందారు. హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కుమారుడు గంగిరెడ్డి ప్రాణాలు కోల్పోయాడు. ఒకే ఇంట్లో ఇద్దరిని కరోనా బలితీసుకోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
father and son died with corona in jagtial district
- Advertisement -