Monday, December 23, 2024

కొత్తగా త్రవ్విన బావి.. తండ్రి, కొడుకు మృతి

- Advertisement -
- Advertisement -

సిరికొండ: ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పోచంపెల్లి గ్రామంలో శుక్రవారం విషాదకర సంఘటన చోటు చేసుకుంది. సిరికొండ ఎస్సై పి. నీరేష్ తెలిపిన వివరాల ప్రకారం … గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు మాడావి సోనేరావు(50), మాడవి సర్యభాను లు కలిసి కొత్తగా త్రవ్విన బావి నీళ్లతో పూజ చేసుకునేందుకు వెళ్లగా తండ్రి బావి నుండి చెంబులో నీళ్లు తీసుకొస్తుండగా ప్రమాదశాత్తు కాలు జారీ బావిలో పడి పోయాడు.

Also Read:  ఈతకు వెళ్లి ముగ్గురు పిల్లలు మృతి..

అక్కడే ఉన్న తన కొడుకు మాడవి సూర్యభాను తండ్రిని రక్షించే క్రమంలో బావిలో కాలు జారీ పడిపోయాడు. దీంతో   ఇద్దరు నీటిలో మునిగి  చనిపోయారు. వ్యవసాయం కోసం కష్టపడి తవ్విన బావి పూజ కోసం వెళ్లిన తండ్రి , కొడుకులు ఇద్దరు మృత్యువాత పడడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News