Thursday, December 26, 2024

ఖమ్మం ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రికొడుకులు మృతి

- Advertisement -
- Advertisement -

Father and Son killed in Road Accident in Khammam

ఖమ్మం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం వెంసూరు మండలంలోని మర్లపాడు-రాయుడు పాలెం మధ్య ప్రధాన రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ డీసిఎం వాహనం అదుపుతప్పి బైక్ ను ఢీకొట్టి బోల్తా పడింది.  ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న తండ్రికొడుకులు మద్దిరెడ్డి కృష్ణా రెడ్డి(70), శ్రీనివాస రెడ్డి(40)లు ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. డిసిఎం వాహనంలో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసలు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Father and Son killed in Road Accident in Khammam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News