- Advertisement -
యాచారం: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలోనిగూడం వద్ద మంగళవారం రోడ్డుప్రమాదం సంభవించింది. సాగర్ రహదారిపై బైకును కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో తండ్రి, కుమారుడు మృతిచెందాడు. మృతులు మేడిపల్లి వాసులు ముచర్ల రాములు(35), సోను(11)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కారు అతివేగమే ఈ ప్రమాదం జరగడానికి కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
- Advertisement -