Wednesday, January 22, 2025

కన్నకూతురిపై అత్యాచారం చేసిన తండ్రి

- Advertisement -
- Advertisement -

Father arrested for raping daughter in hyderabad

కంటోన్మెంట్: కూతురుపై కన్నతండ్రి అత్యాచారం చేసిన ఘటన బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాలను బేగంపేట్ ఏసిపి నరేష్‌రెడ్డి, బోయిన్‌పల్లి సిఐ రవికుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మహబూబ్‌నగర్ ప్రాంతానికి చెందిన రమేష్ (32) జీవనోపాధి నిమిత్తం నగరానికి వచ్చి తాడ్‌బంద్ ప్రాంతంలో నివాసముంటూ భార్య పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. అదే క్రమంలో భార్యాభర్తల మధ్యన గొడవలు జరగటంతో మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రెండవ పెళ్లి చేసుకొని మొదటి భార్యకు పుట్టిన కూతురుతో కలిసి నివాసముంటున్నాడు.

కాగా గత కొన్నిరోజులుగా తన కూతురిపై కన్నేసిన తండ్రి కూతురుని బెదిరించి ఆమెపై ఆత్యాచారానికి పాల్పడుతున్నాడు. అదే క్రమంలో 16న రాత్రి 11 గంటల ప్రాంతంలో తన భార్య పడుకోవటం తో నిద్రిస్తున్న కూతరుపై ఆత్యాచారం చేశాడు. దీనిని గమనించిన తల్లి భర్తను నిలదీసింది. దీంతో ఇంట్లో నుంచి పారిపోయాడు. భార్య పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమేష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాలికను భరోసా కేంద్రానికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News