ప్రేమ వివాహం చేసుకుందని కన్న కూతురిని కత్తితో పొడిచి చంపిన తండ్రికి సికింద్రాబాద్‌లోని కోర్టు పదేళ్ల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. ఎపిలోని కర్నూలు జిల్లా, డోన్ మండలం, అంకుడాడు గ్రామానికి చెందిన వి. మనోహర్ చారీ హైదరాబాద్, అమీర్‌పేట్‌లోని గణేష్ జూవెల్లర్స్‌లో గోల్డ్ స్మీత్‌గా పనిచేస్తున్నాడు. మనోహర్ కూమార్తె మాధవి, సందీప్ అనే యువకుడిని ప్రేమించి సెప్టెంబర్12, 2018న పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి ఇష్టంలేని మనోహర్, కుటుంబ సభ్యులు వారి పెళ్లిని అంగీకరించలేదు.
తాను సందీప్‌తో పాటే ఉంటానని మాధవి చెప్పడంతో అప్పటి నుంచి కూతురిపై మనోహర్ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే మాధవి, సందీప్ ఇద్దరు 19వ తేదీ, సెప్టెంబర్, 2018న ఎర్రగడ్డ వద్ద ఉన్న గోకుల్ థియేటర్ వద్దకు రాగా వారిని చంపేందుకు మనోహర్ కత్తితో దాడి చేశాడు. ఇద్దరిని హత్య చేసేందుకు యత్నించడంతో ఎస్‌ఆర్ నగర్ పోలీసులు మనోహర్‌ను అరెస్టు చేసి 307ఐపిసి కింద కేసు నమోదు చేశారు. సాక్షాలను సేకరించిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టడంతో వాటిని పరిశీలించిన సికింద్రాబాద్‌లోని నాలుగో అదనపు మేజిస్ట్రేట్ జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.