రాయచూర్: కుమారై వివాహానికి తండ్రి పురోహితుడిగా మారిన సంఘటన కర్నాటక రాష్ట్రంలోని రాయ్ చూర్ జిల్లా సిందనూరు చోటుచేసుకుంది. సాధారణంగా పురోహితుల సొంత ఇళ్లలో జరిగే శుభకార్యాలను ఇతర బ్రాహ్మణులు నిర్వహిస్తుంటారు. సిందనూర్ కు చెందిన మల్లయ్య స్వామి తన కూతురు వివాహం చేయాలని నిశ్చయించారు. కర్నాటకలో లాక్ డౌన్ విధించిన కారణంగా పెళ్లికి బయటి పురోహితులేవరూ రాలేకపోయారు. ఈ క్రమంలోనే వధువు తండ్రే పురోహితుడిగా వ్యవహరించారు. వేదమంత్రాలతో స్వయంగా తనే దగ్గరుండి కూతురితో ఏడడుగులు వేయించారు. ఇదే సమయంలో తన కుమారైతో పాటు బంధువులకూతురు వివాహాన్ని కూడా ఆదే ముహుర్తానికి జరిపించారు. కరోనా కాలంలో దేశవ్యాప్తంగా చాలా మందికి కొన్ని చెడు, మంచి అనుభవాలు ఎదురవుతున్నాయి. అలాంటి ఒక మంచి అనుభవం కర్నాటకకు చెందిన ఒక తండ్రికి దక్కింది. లాక్ డౌన్ కారణంగా కొందరూ శుభాకార్యాలను వాయిదావేసుకుంటున్న సంగతి తెలిసిందే.
కూతురు వివాహానికి పురోహితుడిగా మారిన తండ్రి
- Advertisement -
- Advertisement -
- Advertisement -