Sunday, December 22, 2024

కసాయి తండ్రి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

father brutally beat child death in hyderabad

హైదరాబాద్: నాలుగు రోజుల క్రితం సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎసి గార్డ్ లో కన్న కూతురిని తండ్రి నేలకేసి కొట్టడంతో చావుతుకుల్లో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం చిన్నారి మృతి చెందింది. శనివారం బాత్రూంలో ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి సకినా ఫాతిమాను ఆమె తండ్రి బాసిత్ ఖాన్ తీవ్రంగా కొట్టాడు. చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణలు విడిచింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సైఫాబాద్ పోలీసులు కసాయి తండ్రి బాసిత్ అలీఖాన్‌ను అరెస్ట్ చేశారు. బాసిత్ అలీఖాన్, సన అనే యువతిని 2015లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న బాసిత్ అలీఖాన్‌కు నలుగురు ఆడ పిల్లలే జన్మించారు. నలుగురు ఆడ పిల్లలు పుట్టడంతో బాసిత్ భార్య, పిల్లలను తరచూ కొడుతుండేవాడని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News