Sunday, December 22, 2024

కూతురిపై తండ్రి కర్కశత్వం

- Advertisement -
- Advertisement -

father brutally beat the child in hyderabad

నేలకేసి కొట్టిన తండ్రి
చావుబతుకుల్లో బాలిక
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సైఫాబాద్ పోలీసులు

హైదరాబాద్: కన్న కూతురిని తండ్రి నేలకేసి కొట్టడంతో చావుతుకుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంఘటన హైదరాబాద్, సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… నగరంలోని ఎసి గార్డ్ ప్రాంతానికి చెందిన బాసిత్ అలీఖాన్, సన అనే యువతిని 2015లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న బాసిత్ అలీఖాన్‌కు నలుగురు ఆడ పిల్లలే జన్మించారు. నలుగురు ఆడ పిల్లలు పుట్టడంతో బాసిత్ భార్య, పిల్లలను తరచూ కొడుతుండేవాడు. ఈ క్రమంలోనే బాసిత్ శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటికి వెళ్తుండగా మూడో కూతురు సకినా ఏడ్చింది. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తుడిగా మారిని బాసిత్ కుతురిని పట్టుకుని నేలకేసి కొట్టాడు. బాలికకు తీవ్ర గాయాలు కావడంతో చిన్నారి తల్లి సమీపంలోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించింది. బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఉస్మానియా వైద్యులు తెలిపారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సైఫాబాద్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News