Monday, January 20, 2025

కిడ్నాపయ్యాడని తండ్రి ఫిర్యాదు.. పోలీసులకు షాకిచ్చిన కుమారుడు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః తన కుమారుడు కిడ్నాప్‌కు గురయ్యాడని తండ్రి ఫిర్యాదు చేస్తే విచారణ చేసిన పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం… ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్‌ఫేటకు చెందిన షోయబ్ తండ్రికి ఫోన్ చేసిన తన స్నేహితుడు హమీద్‌తో గొడవ జరిగిందని ఫోన్‌లో చేప్పి మొబైల్‌ను స్విచ్ ఆఫ్ చేశాడు. ఆందోళన చెందిన తండ్రి వెంటనే ఫిల్మ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి షోయబ్ ఎక్కడ ఉన్నాడో అక్కడికి చేరుకున్నారు. గొడవ జరిగినట్లు భావించిన ప్రాంతం నగర శివారులోకి వెళ్లి చూడగా షోయబ్ తనతో గొడవ పెట్టుకున్నాడని చెప్పిన హమీద్‌తో కలిసి జాల్సాలు చేస్తూ పోలీసులకు కన్పించాడు. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. షోయబ్ తండ్రితో కిడ్నాప్ డ్రామా ఆడినట్లు పోలీసులు గుర్తించారు. షోయబ్‌కు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి అతడి తండ్రికి అప్పగించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News