- Advertisement -
యాదాద్రి: భార్యభర్తల మధ్య కుటుంబకలహాల నేపథ్యంలో లాడ్జిపై నుంచి దూకి తండ్రి,కూతురు ఆత్మహత్య చేసుకున్న విషాదఘటన యాద్రిలో చోటుచేసుకుంది. మృతులను హైదరాబాద్ లింగంపల్లికి చెందిన తండ్రి కూతురు చెరుకూరి సురేష్(40), శ్రేష్ఠ(6)గా గుర్తించారు. తన భార్యతో గొడవతోనే చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ లభించినట్టు పోలీసులు చెప్పారు. వీరు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వచ్చి లాడ్జి అద్దెకు తీసుకున్నట్టు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని భువనగిరి ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు తెలిపారు.
- Advertisement -