Wednesday, December 4, 2024

తండ్రి ప్రాణం తీసిన తనయుడి ప్రేమ వివాహం

- Advertisement -
- Advertisement -

Father dead in son Love marriage issue

చెన్నై: కుమారుడి ప్రేమ వివాహం తండ్రి ప్రాణం తీసిన సంఘటన తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పుదుపాయానికి చెందిన తండవేల్(55) ఇద్దరు కుమారులు పెరియన్నన్(32), ప్రకాశ్(24) ఉన్నారు. తంగవేల్ దగ్గర బంధువు సెల్వమ్‌కు సంధ్య అనే కుమార్తె ఉంది. ప్రకాశ్, సంధ్య మధ్య గత కొన్ని రోజుల నుంచి ప్రేమ వ్యవహారం నడుస్తోంది. మార్చిలో ప్రేమ జంట ఇంటి నుంచి పారిపోయి 24వ తేదీన పెళ్లి చేసుకున్నారు. తమకు రక్షణ కల్పించాలని ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించారు. గ్రామ పెద్దలు, పోలీసులు పంచాయతీ పెట్టి సంధ్యను తండ్రి సెల్వమ్ కు అప్పగించారు. మార్చి 29న మళ్లీ ప్రేమ జంట లేచిపోయింది. వారం రోజుల్లో తన కుమార్తెను అప్పగించాలని తంగవేల్‌ను సెల్వం బెదిరించాడు. దీంతో తంగవేల్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వారు ఎన్నికలైన తరువాత మాట్లాడుకుందామని పోలీసులు సర్ది చెప్పారు. సెల్వం తన బంధువులతో కలిసి తంగవేల్ ఇంటికి వచ్చి తన కుమార్తె ఎక్కడ ఉందో చెప్పాలని నిలదీశాడు. కోపంతో ఊగిపోయిన సెల్వం కత్తితో తంగవేల్, పెరియన్నన్‌పై దాడి చేశాడు. వెంటనే సెల్వమ్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా తంగవేల్ మార్గం మధ్యలో చనిపోయాడు. పెరియన్నన్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు వ్యవహారంపై తంగవేల్ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News