Sunday, January 19, 2025

తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని చంపిన తనయుడు..

- Advertisement -
- Advertisement -

తల్లితో తరచూ గొడవపడుతూ, ఆమెను వేధిస్తున్న తండ్రిని ఓ కొడుకు దారుణంగా హతమార్చాడు. మృతదేహాన్ని తగులబెట్టెందుకు ప్రయత్నించి, ఆ తర్వాత మనసు మార్చుకుని పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. దిగ్భ్రాంతి గొలిపే ఈ సంఘటన కర్ణాటకలోని దేవరభూపుర గ్రామంలో జరిగింది.

55 ఏళ్ల బండి తిమ్మన్న.. భార్య, కుమారుడు శీలవంతతో కలసి దేవరభూపురలో నివసిస్తున్నాడు. రోజూ భార్యతో  గొడవపడి ఆమెను కొట్టడం తిమ్మన్నకు అలవాటుగా మారింది. ఆదివారంనాడు అతను భార్యపై దాడి చేసి కొట్టడంతో, కొడుకు శీలవంత సహించలేకపోయాడు. కోపంతో రగిలిపోయిన శీలవంత, పెద్ద రాయి తీసుకుని అదే పనిగా తండ్రి తలపై కొట్టాడు.

కొడుకును వారించేందుకు తల్లి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తిమ్మన్న అక్కడికక్కడే మరణించాడు. వెంటనే మృతదేహాన్ని అక్కడినుంచి తరలించేందుకు కొడుకు ప్రయత్నించాడు. అయితే ఏం చేసినా, పోలీసులకు దొరికిపోక తప్పదని గ్రహించి, పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. తనను భర్త కొట్టడం చూసి సహించలేక  శీలవంత కోపంతో దాడి చేశాడని అతని తల్లి పోలీసులకు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News