Thursday, January 23, 2025

కూతురిని చూసేందుకు వచ్చి గుండెపోటుతో తండ్రి మృతి

- Advertisement -
- Advertisement -

ధర్మారం: కూతురిని చూసేందుకు వచ్చిన తండ్రి గుండెపోటుతో మృతి చెందిన విషాద ఘటన ధర్మారం మండలం మల్లాపూర్ గురుకుల విద్యాలయంలో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం… జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం స్థంభంపల్లి గ్రామానికి చెందిన భూపాలపల్లి విజయ్ (55) రెండో శనివారం సందర్భంగా మల్లాపూర్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్న తన కూతురు స్పందనను చూసేందుకు వచ్చారు.

కూతురిని కలిసిన అనంతరం తల్లితండ్రులు పక్కనే ఉన్న ఓ ఖాళీ ప్రదేశంలో కూర్చుని మాట్లాడుతుండగా ఒక్కసారిగా గుండెలో నొప్పిరావడతో విజయ్ కుప్పకూలిపోయాడు. వెంటే గురుకుల విద్యాలయం పేరెంట్స్ కమిటీ చైర్మన్ సుంచు మల్లేశం హార్ట్ ఫిషర్ చేయడంతో పాటు అంబులెన్స్‌కు సమాచారం అందించారు.

స్థానికుల సహాయంతో అంబులెన్స్ సంఘటన స్థలానికి చేరుకొని కరీంనగర్ తరలించారు. తీగలగుట్టపల్లి వద్ద రైల్వే గేటు పడటంతో అరగంట ఆలస్యం మూలంగా విజయ్ ప్రాణాలు కోల్పోయాడు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా కొద్ది సేపటి క్రితమే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కన్న కూతుర్ని చేసేందుకు వచ్చి గుండెపోటుతో మృతి చెందటంతో విజయ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News