Monday, December 23, 2024

కూతురి వివాహ వేడుకల్లో తండ్రి మృతి..

- Advertisement -
- Advertisement -

గోదావరిఖని: గోదావరిఖనికి చెందిన సీనియర్ జర్నలిస్టు ఎలిగేటి శంకర్ (54) బుధవారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. బుధవారం స్థానిక జిఎం కాలనీలోని సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో తన కూతురు వివాహ వేడుకలను ఆయన జరిపించారు. వివాహ వేడుకల తంతు ముగిసిన కొద్ది క్షణాల్లోనే శంకర్ ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

వెంటనే ఆయనను బంధువులు గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు.. అప్పటి వరకు కోలాహలంగా ఉన్న ఆ వివాహ వేడుకల్లో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. కుటుంబ సభ్యుల, బంధువుల రోధనలు మిన్నంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News