Sunday, December 22, 2024

హైదరాబాద్‌లో పెను విషాదం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హైదరాబాద్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. ఐదేళ్ల వయసులో కన్న కూతురుని అనారోగ్యం కబళించడంతో జీర్ణించుకోలేక ఓ తండ్రి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికులు అందించిన సమాచారం ప్రకారం మృతుడు కిషోర్ ఖైరతాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. ఆయనకు ఆరాధ్య అనే ఓ ఐదేళ్ల పాప ఉంది. ఆ పసితల్లిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. బుడి బుడి అడుగులతో, తమ కుమార్తె వచ్చిరాని మాటలకు ఆ తల్లిదండ్రులు ఎంతో ఆనందపడ్డారు. కాని విధి ఆడిన ఆట వారికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఆరాధ్యకు ఊపిరితిత్తుల సమస్య వచ్చింది. రెండు నెలల నుంచి అనారోగ్యంతో ఇబ్బంది పడుతోంది. ఎన్నిఆసుపత్రులు తిప్పినా ఫలితం లేకపోయింది. అనారోగ్యంతో పోరాడుతూ ఆ పసిపాప రెండురోజుల క్రితం శాశ్వత నిద్రలోకి జారుకొంది. తమ గారాల పట్టి ఇక రాదని తెలుసుకొని ఆ తల్లిదండ్రులు గుండెలవిదేలా రోదించారు.

తన చేతుల్లో అల్లారుముద్దుగా పెరిగిన తన ప్రాణానికి ప్రాణంగా భావించే కన్న కూతురు మరణం ఆ తండ్రిని తీవ్రంగా మానసిక క్షోభకు గురిచేసింది. కూతురు మరణాన్ని జీర్ణించుకోలేని ఆ పసిపాప తండ్రి కిషోర్ కూతురు ఇక తిరిగిరాదనే విషయాన్ని జీర్ణించుకోలేక పోయిన కిషోర్ ఆత్మహత్య చేసుకుంటున్నానని స్నేహితులకు మెసేజ్ పంపాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. ఖైరతాబాద్‌లోని రైలు పట్టాలపై కిషోర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఖైరతాబాద్‌లోని ఆయన నివాసం వద్ద విషాద చాయలు అలుముకున్నాయి. పసిపాప మరణంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉన్న అందరి గుండెలు బరువెక్కాయి. ఓవైపు కుమార్తెను, మరోవైపు భర్తను పోగొట్టుకున్న ఆ తల్లి గుండెలు విలపించేలా ఎంత ఏడ్చినా ఫలితం లేకపోయింది. రెక్కాడితే గానీ డొక్కాడని స్థితిలో ఉన్న తల్లిదండ్రలకు ఈ విధంగా కష్టం రావడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. పాప మృతితో కాలనీవాసులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కిషోర్ ఆత్మహత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News