Saturday, February 22, 2025

కూతురు పెళ్లిలో గుండెపోటుతో కుప్పకూలిన తండ్రి

- Advertisement -
- Advertisement -

గుండెపోటుతో రోజు ఎంతో మంది ప్రాణాలు విడుస్తున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలా మంది హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కుమార్తె వివాహ వేడుకలో తండ్రి గుండెపోటుతో మృతి చెందడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ హృదయ విదారక ఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వరపల్లి గ్రామం లో చోటు చేసుకుంది. స్థానికులు, బంధువులు వెల్లడించిన వివరాల ప్రకారం రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన కుడిక్యాల బాలచంద్రం(56) వృత్తిరీత్యా కామారెడ్డిలో స్థిరపడ్డారు. ఆయనకు భార్య రాజమణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

పెద్ద కూతురు కనకమహాలక్ష్మీ వివాహం బెంగళూరుకు చెందిన రాఘవేంద్రతో జరిపించాలని ఇటీవల నిశ్చయించారు. ఈ మేరకు శుక్రవారం జంగంపల్లి శివారులోని బిటిఎస్ సమీపంలోని ఓ కళ్యాణ మండపంలో వైభవంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు. బంధుమిత్రులంతా ఈ వేడుకకు హాజరయ్యారు. వివాహ క్రతువులో భాగంగా కన్యా దానం చేసిన అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైన బాలచంద్ర పెళ్లి మండపంలోనే కుప్పకూలిపోయాడు. బంధువులు వెంటనే జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అప్పటివరకు కళకళలాడుతున్న పెళ్లి మండంపలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News