లవర్ తో కూతరు లేచిపోవడంతో తట్టుకోలేక తండ్రి పరుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన నల్గొండ జిల్లా చిట్యాలలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. చిట్యాలకు చెందిన రెముడాల గట్టయ్య 18ఏళ్ల కూతురు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేసిన పోలీసులు.. సదరు యువతి, ఓ యువకుడిని ప్రేమ వివాహం చేసుకుని వెళ్లిపోయిందని తెలిపారు. షాక్ గురైన గట్టయ్య.. తన కూతురితో ఒక్కసారి మాట్లాడాలని పోలీసులను అడగగా.. కూతురు నిరాకరించింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన గట్టయ్య తన పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తండ్రి మరణ వార్తా.. పోలీసులు కూతురికి ఫోన్ చేసి చెప్పినా.. ఆమె రాలేదు. తాను ముంబైలో ఉన్నానని తిరిగి రావడం కుదరదని కూతురు చెప్పడంతో కుటుంబసభ్యులు తీవ్ర మనోవేదనతో కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ సంఘటన గ్రామంలోనూ విషాదాన్ని నింపింది.