Friday, July 5, 2024

కుమార్తె గర్భానికి కారణమైన తండ్రికి 101 ఏళ్ల జైలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పదేళ్ల ప్రాయం నుంచి కన్నకూతురిపై ఆరేళ్ల పాటు లైంగిక దాడి కొనసాగిస్తూ ఆమె గర్భానికి కారణమైన తండ్రికి కేరళలోని స్పెషల్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 101 ఏళ్ల జైలు శిక్షతోపాటు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 16 ఏళ్ల వయసులో ఆ బాలిక గర్భం దాల్చడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం పోక్సో, జువెనైల్ జస్టిస్ యాక్ట్ వంటి చట్టాల కింద గతవారం ఆ వ్యక్తికి కేరళ లోని మల్లపురానికి చెందిన స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు శిక్ష వేసింది. ఈ క్రూరమైన నేర ప్రభావం ఆ బాలికపై జీవితాంతం ఉంటుందని తీవ్ర విచారం వ్యక్తం చేసింది. “ ఒక తండ్రిగా ఆ చిన్నారిని కాపాడాల్సిన వ్యక్తే …ఈ దారుణానికి ఒడిగట్టాడు. 16 ఏళ్ల వయసులో ఆమె గర్భం దాల్చేవరకు పైశాచికత్వాన్ని కొనసాగించాడు. దీనిని సాధారణ లైంగిక నేరంగా చూడలేం. నేరానికి పాల్పడిన వ్యక్తి ఆర్థికంగా, విద్యాపరంగా, వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చినప్పటికీ అతడిపై ఎలాంటి కనికరం చూపలేం.

”అని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ బాలిక తల్లి నిద్రిస్తున్న సమయం లోనో, ఆమె లేనప్పుడో, ఈ అకృత్యానికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చడంతో అతడే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పుడు కూడా ఈ విషయం ఎవరికీ చెప్పొద్దన్నాడు. కానీ తర్వాత ఆమె ఇచ్చిన వాంగ్మూలంలో అసలు విషయం బయటపడిందని ఆ కథనాలు పేర్కొన్నాయి. ఆ తర్వాత మూడు నెలల గర్భాన్ని వైద్యులు తొలగించారు. డీఎన్‌ఏ పరీక్ష , ఆ ఘటనకు కారకుడు ఎవరో ధ్రువీకరించింది. ఈ వివరాలన్నింటినీ కోర్టు ముందుంచడంతో ఈ సంచలన తీర్పు వెలువడింది. బాధితురాలి తల్లితోపాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా అతడికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News