Monday, December 23, 2024

తండ్రి బదిలీ..అదే స్థానంలో ఎస్‌ఐగా కుమార్తె

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: కర్నాటకలోని మాండ్య నగర సెంట్రల్ పోలీసు స్టేషన్‌లో మంగళవారం భావోద్వేగ సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. తండ్రి బదిలీ కావడంతో ఆయన స్థానంలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా బదిలీపై వచ్చిన ఆయన కుమార్తె బాధ్యతలు చేపట్టిన అరుదైన దృశ్యాన్నిన్ని ఆ పోలీసు స్టేషన్ సిబ్బంది వీక్షించారు. కుమార్తెకు పుష్పగుచ్ఛం అందచేసి తండ్రి బాధ్యతలు అప్పగించారు.

సబ్ ఇన్‌స్పెక్టర్ బిఎస్ వెంకటేష్‌కు ఎస్‌పి ఆఫీసుకు బదిలీ కాగా ఆయన కుమార్తె బివి వర్ష ఆ పోస్టులో నియమితులయ్యారు. పోలీసు స్టేషన్ బాధ్యతలను కుమార్తెకు తండ్రి అప్పగించారు.

ఎకనామిక్స్‌లో డిగ్రీ చదివిన వర్ష2022లో పోలీసు శాఖలో చేరారు. కలబురగిలో పోలీసు శిక్షణ పూర్తి చేసుకున్న వర్ష ప్రొబేషనరీ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా మైసూరు జిల్లాలోని హన్సూరు, పెరియపట్న పోలీసు స్టేషన్లలో పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆమె మాండ్య సిటీ వెస్ట్ పోలీసు స్టేషన్‌లో పనిచేశారు. . తాజాగా సెంట్రల్ పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐగా ఆమె నియమితులయ్యారు.

ఆమె తండ్రి వెంకటేష్ 1990 నుంచి 2006 వరకు ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో 16 ఏళ్లపాటు సేవలందచేసిన ఆయన రిలైర్‌మెంట్ తర్వాత పోలీసు శాఖలో చేరారు. ఆయన స్వస్థలం తుముకూరు జిల్లాకు చెందిన కునిగల్ తాలూకాలోని తురేబొమ్మనహళ్లి గ్రామం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News