హైదరాబాద్ : కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రి కీచకుడిలా మారాడు. కుమార్తెపై కన్న తండ్రి లైంగిక వేదింపులకు పాల్పడుతున్ప ఘటన కుషాయిగూడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గత నెల 27న కాప్రా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థలకు షీటీమ్స్ పోలీసులు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఈవ్ టీజింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్శహించారు. సమావేశం అనంతరం అదే పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక తండ్రి లైంగిక వేధింపులు గుర్తించి షీటీమ్స్ దృష్టికి తీసుకెల్లింది.
తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుందని ఆమెకు నిద్ర కోసం టాబ్లెట్స్ ఇచ్చేవారని తెలిపింది. ఆమె నిద్రలోకి వెళ్లగానే తండ్రి ప్రశాంత్ తనపై లైంగికి వేధింపులకు పాల్పడేవాడని తెలియజేసింది. రెండేళ్లుగా వేధిస్తూ విషయం ఎవరికి చెప్పొద్దంటూ బెదిరింపులకు పాల్పడే వాడని తెలిపింది. బాధితురాలి ఫిర్యదు మేరకు కుషాయిగూడ పోలీసులు నిందితుడు ప్రశాంత్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.