Friday, January 17, 2025

కోడలిని వివాహం చేసుకున్న 70 ఏళ్ల మామ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కుమారుడు చనిపోవడంతో 70 ఏళ్ల మామ తన కోడలిని పెళ్లి చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్ జిల్లాలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… ఛపియా ఉమ్రామ్ గ్రామంలో కైలాశ్ యాదవ్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. కైలాశ్‌కు 12 సంవత్సరాల క్రితం భార్య మరణించింది. కైలాష్ యాదవ్ బర్రల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరధిలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. కైలాశ్ నలుగురు పిల్లలు ఉండడంతో అందరికీ పెళ్లిలు చేసుకొని వేర్వేరుగా ఉంటున్నారు. కైలాశ్ మూడో కుమారుడు మృతి చెందంగా కోడలు పూజ ఒంటరి జీవితం సాగిస్తోంది.

ఆమె భర్త చనిపోయిన తరువాత మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ రెండో భర్త కుటుంబంలో కలిసి ఉండలేక మళ్లీ మొదటి భర్త ఇంటికి వచ్చింది. మొదటి భర్త తండ్రి కైలాష్ పెళ్లి చేసుకోవడం ఇష్టమేనని తెలిపింది. గ్రామస్థులు కుటుంబ సభ్యుల సమక్షంలో జంట ఒక్కటయ్యారు. కైలాశ్ తన కోడలను ఓ దేవాలయానికి తీసుకెళ్లి మెడలో మూడుమూళ్లు వేసి వివాహం చేసుకున్నాడు. కోడలిని పెళ్లి చేసుకున్న మామ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులకు ఈ విషయం చేరింది. ఇద్దరు మనసులు కలవడంతో పెళ్లి చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News