Saturday, November 23, 2024

కుషాయిగూడలో దారుణం: కన్న తండ్రినే హతమార్చిన బాలిక..

- Advertisement -
- Advertisement -

Father killed by daughter due to love affair

హైదరాబాద్: ప్రియుడితో ప్రేమ వద్దన్నందుకు ఓ బాలిక కన్న తండ్రినే హతమార్చింది. ఈ దారుణ ఘటన నగరంలోని కుషాయిగూడలో చోటుచేసుకుంది. తన ప్రేమకు అడ్డుపడుతున్నాడని మైనర్ బాలిక, తన త్రండి రామకృష్ణ తినే ఆహారంలో మత్తుమందు కలిపింది. దీంతో తండ్రి స్పృహా కోల్పోయాడు. ఆ తర్వాత ప్రియుడిని పిలిపించి తండ్రిని చంపించింది. సుపారీ గ్యాంగ్, ప్రియుడుతో కలిసి బాలిక తన తండ్రిని హత్య చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కుషాయిగూడ పోలీసులు మైనర్ బాలికతోపాటు నలుగురిని అరెస్టు చేశారు.

Father killed by daughter due to love affair

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News