Monday, December 23, 2024

కొడుకే కాలాయముడయ్యాడు..

- Advertisement -
- Advertisement -

ఎల్లారెడ్డి : అల్లారుముద్దుగా పెంచిన కొడుకే తనకు కాలాయముడవుతాడని ఆ తండ్రి ఊహించలేదు. ఆస్తి కోసం ఓ పథకం ప్రకారం కన్న తండ్రిని హతమార్చిన సంఘటన ఎల్లారెడ్డి పట్టణంలో జరిగింది. పట్టణంలో ఆదర్స్ గల్లీలో ఉండే జడే తుకారాం (74) అనే వ్యక్తి ఆదివారం అనుమానస్పద స్తితిలో మృతి చెందిన విషయం విదితమే. మృతుని శరీరంపై గాయం ఉండటంతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి తుకారాంది హత్యగా నిర్ధారించారు. జాడే తుకారాం కుమారుడు జాడే బాలకిషన్ 47 అలియాస్ కిశోర్ తన స్నేహితుడు గొల్లపల్లి రాజాఎలీషా 42 అలియాస్ డుంబు సహాకారంతో దారుణంగా హతమార్చినట్లు ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. హత్య కేసులో పాలుపంచుకున్ప బాలకిషన్ అలియాస్ కిశోర్, రాజా ఎలీషా, సాక్షాలను చెరిపివేసిన కిశోర్ భారన్య జాడి శిల్ప 38లను బుధవారం అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు డిఎస్పి చెప్పారు.

మధ్యాహనం స్థానిక పోలీస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో హత్య కేసు నిందితులను హాజరుపరిరిచి వివరాలను వెల్లడించారు.తుకారాం మొదటి భార్యకు కిశోర్‌తో పాటు ముగ్గురు కాతుర్లని ఆమె మృతి చెందగా తరువాత మరో మహిళను వివాహం చేసుకున్నారు. ఆమె సంతానం లేరు. తండ్రి కొడుకుల మధ్య మనస్పర్థాలు రావడంతో కిశోర్ హైదరాబాద లో ఉంటుంన్నాడు. వ్యాపారంలో నష్టం రావడంతో డబ్బుల కొరకు తండ్రిని ఆశ్రయించాడు. రెండు సంవత్సరాల పాటు తండ్రి నెలకు పదివేల చొప్పున కిశోర్‌కు చెల్లించాడు. కిశోర్ వ్యాపార సంపాదన తగ్గడంతో డబ్బులు ఇవ్వడానికి వెనుకాడాడు. ఈ క్రమంలో కిశోర్, తన భార్య తో కలసి తండ్రి వద్దకు వెళ్లి ఆర్థిక సహాయం చేయాలని లేదా ఇంటిని తన పేరుపైన రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి తెచ్చాడు.

తీవ్ర ఆందోళన గురైన తుకారాం ఇరువురిని బయటకు వెళ్లాల్సిందిగా సూచించాడు. దీంతో విచక్షణ కోల్పోయిన కిశోర్ పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న ప్లాస్టర్‌తో నోటికి చుట్టి, కాళ్లు చేతులు కట్టేసి స్నేహితుడు డుంబుతో కలసి చితకబాదాడని వివరించారు. దాడిలో తుకారాం మృతి చెందాడు. అనంతరం గుండెపోటుతో తన తండ్రి మృతి చెందాడని నమ్మించే ప్రయత్నం చేయగా, మృతుడి శరీరంపై గాయాలు చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హత్య కేసులో చాకచక్యంగా వ్యవహరించిన నలుగురు సిబ్బందికి రివార్డు అందజేసినట్లు డిఎస్పీ తెలిపారు. సమావేశంలో స్థానిక సీఐ శ్రీనివాస్, ఎస్సై గణేష్ సిబ్బంది ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News