Sunday, January 19, 2025

కొడుకు చేతిలో తండ్రి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

కోరుట్ల రూరల్ : కోరుట్ల మండలం లో సంగెం గ్రామంలో కన్న తండ్రిని కొడుకు రోకలి బండతో కొట్టడంతో తండ్రి అక్కడిక్కడే మరణించిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సంగెం గ్రామానికి చెందిన వల్లకొండ చిన్న మల్లయ్య కు(53) భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. జీవనోపాధి కోసం గత 15 సంవత్సరాలుగా గల్ఫ్‌లో ఉండి ఇటీవల వచ్చి ఇంటి వద్దే ఉంటున్నాడు. గల్ఫ్ వెళ్తున్న సమయంలో సెలవుపై వ చ్చినప్పుడల్లా భార్య రాజేశ్వరీతో గొడవలు జరుగుతుండేవి. భార్య రాజేశ్వరీ సంగెంలో కాకుండా కూతురి వద్దె ఉంటుంది.

తండ్రి ఎప్పుడు గొడవలు చేస్తుండు అనే కక్ష పెంచుకున్న పెద్ద కుమారుడు పవన్ మరో ఇద్దరితో కలిసి తండ్రి చిన్న మల్లయ్యను హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. హత్యకు సహకరించిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మృతదేహాన్ని పోస్టు మార్టంకు తరలించి మృతుని సోదరుడి పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని డిఎస్పీ రవీందర్ రెడ్డి, సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్‌ఐ సతీష్ కుమార్ పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News