Saturday, January 25, 2025

కన్నతండ్రిని కడతేర్చిన కసాయి కొడుకు

- Advertisement -
- Advertisement -

తన తల్లిని తరచూ వేధిస్తున్నాడని స్నేహితుడితో కలిసి కన్నతండ్రిని హత్య చేసిన కసాయి కొడుకు సంఘటన మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం, ఇందారంలో చోటుచేసుకుంది. గాఢ నిద్రలో ఉన్న కన్న తండ్రిని కత్తితో మెడ కోసి దారుణంగా హత్య చేశాడు. వివరాళ్లోకి వెళ్తే..గ్రామానికి చెందిన ఆవిడపు రాజయ్య (45) అనే ఆటో డ్రైవర్ హత్యకు గురైన సంఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని తల్లిని వేధిస్తున్నాడని తండ్రిపై కక్ష పెంచుకొని సాయిసిద్దార్ద్ తన స్నేహితులతో పథకం పన్ని అతి దారుణంగా గొంతు కోసి గురువారం అర్ధరాత్రి హత్య చేశాడు. ఆవిడపు రాజయ్య, భార్య భాగ్యలక్ష్మి, కొడుకు సాయిసిద్దార్ద్‌తో ఇందారంలో నివాసం ఉంటున్నారు. రాజయ ఏడేళ్లుగా ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు.

కుటుంబంలో తరచూ గొడవలు కావడం, తరచుగా భాగ్యలక్ష్మి తన పుట్టింటికి వెళ్లడం జరుగుతూనే ఉంది. ఇదే క్రమంలో గత పది రోజుల క్రితం భార్యతో గొడవ పడి సిసిలో తన అన్న ఇంటికి వెళ్లిపోయాడు. తరచూ తన తల్లిని వేధిస్తున్నాడని కొడుకు సిద్దార్ద్ పథకం పన్నాడు. గురువారం రాత్రి మండలంలోని నర్వ గ్రామానికి చెందిన పొట్టాల వినయ్, మరో స్నేహితుడు శ్రీరాంపూర్ అరుణక్క నగర్‌కు చెందిన జలంపెల్లి సందీప్‌తో కలిసి గాఢ నిద్రలో ఉన్న తండ్రిని లేపి గొడవ పడి కత్తులతో విచక్షణ రహితంగా గొంతు కోసి హత్య చేశాడు. గ్రామంలో అత్యంత దారుణంగా హత్య జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. జైపూర్ ఎసిపి వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకొని పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీధర్ తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News