Sunday, December 22, 2024

తండ్రిని చంపిన తనయుడు..

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: మద్యం తాగి ఇంట్లో గొడవలు సృష్టిన్నాడనే కారణంతో తండ్రిని కొడుకు హత్య చేసిన సంఘటన పెద్దపల్లి మండల పరిధిలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… హన్మంతునిపేట గ్రామానికి చెందిన యాదగిరి ఓదెలు (55), రాజశేఖర్ తండ్రి, కొడుకులు. ఓదెలు మ్యారేజి బ్యూరోగా పని చేస్తున్నాడు. అయితే ఓదెలు నిత్యం తాగి వచ్చి కుటుంబ బాగోగులు చూసుకోకుండా ఇంట్లో కొడుకుతో గొడవలకు పాల్పడేవాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి కూడా ఎప్పటిలాగానే

తండ్రి ఓదెలు తాగి వచ్చి ఇంట్లో గొడవ చేస్తున్న క్రమంలో రాజశేఖర్ ఓదెలుపై రాజకూరగాయల కత్తిపీటతో చాతిపై, పొట్టలో పొడిచి హత్య చేశాడు. కాగా రాజశేఖర్ ఐటిఐ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటున్నట్లుగా తెలిపారు. సమాచారం అందుకున్న ఎసిపి కృష్ణ, సిఐ కృష్ణలు, ఎస్‌ఐలు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి, కోర్టుకు హాజరు పరచనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News